బాధిత కుటుంబానికి అండగా చైతన్య యూత్
On
విశ్వంభర, నెల్లికుదురు: బాధిత కుటుంబానికి చైతన్య యూత్ అండగా ఉంటుందని అధ్యక్షులు ప్రతాప్ చెప్పారు. మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన బొమ్మగాని అంజయ్య మాతృమూర్తి లచ్చమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో సంబంధిత యూత్ ప్రతినిధులు శుక్రవారం అంజయ్య ఇంటికి వెళ్లి లచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. ఆపదలోనూ ధైర్యంగా ఉండాలని మనోనిబ్బరం కోల్పోవద్దని చెప్పి నివాళులర్పించారు.ఒక క్వింటాలు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మెర అశోక్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు , యూత్ ప్రతినిధులు పల్లె యాకయ్య, రాజశేఖర్, సోమయ్య, పల్లె కిరణ్, క్రాంతి, శ్రీ పాల్, గణేష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



