పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

భార‌త్ దాడుల‌తో అల్లాడుతున్న పాకిస్తాన్‌

పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

జమ్మూ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు..
- తిప్పికొట్టిన సైన్యం.. పాక్‌పై ఎదురుదాడి 
- ఇస్లామాబాద్‌, లాహోర్‌తో పాటు ప్ర‌ముఖ న‌గ‌రాలే ల‌క్ష్యంగా భార‌త్ వైమానిక, మిసైల్ దాడులు 
 - పాక్‌కు చెందిన 3 ఫైట‌ర్ జెల్ల‌ను కూల్చేసిన భార‌త్ 
- ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను ధ్వంసం చేసిన భార‌త్ 
- సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్‌ 
- జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లో హైఅలర్ట్‌..

విశ్వంభ‌ర‌, నేష‌న‌ల్ బ్యూరోః 

14 copy

జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు.
భారతదేశంలోని అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ పెద్ద దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే, భారత సైన్యం దానిని సకాలంలో తిప్పికొట్టింది. జమ్మూలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌తో పాటు, రాజస్థాన్‌లోని పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించింది.యితే, పాకిస్తాన్ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్‌కు చెందిన 3 ఫైటర్ జెట్లను బారత్ కూల్చివేసింది. ఇందులో ఒకటి F-16, రెండు JF-17లు సహా మొత్తం 5 విమానాలు ఉన్నాయి.
అంతకుముందు, పాకిస్తాన్ భారతదేశంలోని అనేక ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే, భారతదేశం S400 రక్షణ వ్యవస్థ దాని దుష్ట ఉద్దేశాలను భగ్నం చేసింది. పాకిస్తాన్ కు చెందిన ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను భారత్ ధ్వంసం చేసినట్లు సమాచారం.అంతకుముందు, 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విఫలమైన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. రాత్రి 9 గంటలకు కొద్దిసేపటి ముందు, జమ్మూలో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అప్పుడు, సైరన్లు మోగడం ప్రారంభించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ కాలంలోని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పరిస్థితి మరింత దిగజారడంతో, నగరంలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తమ స్నేహితులు, బంధువులను సంప్రదించడానికి ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ భాగం ఇప్పుడు అంధకారంలో ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్‌లలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మరొక రాష్ట్రమైన రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించారు.
సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్‌ క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్‌ పాటించారు.
జమ్మూతో సహా పఠాన్‌కోట్‌, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌ రేంజర్లు  కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్‌ సెక్టార్‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు. 
జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లో హైఅలర్ట్‌..
భారత్‌-పాక్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్‌, లష్కరే తొయ్యిబా ఉగ్రసంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు.
ఈ జిల్లాలో కరెంట్‌ బంద్‌
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్‌ జిల్లాలో రాత్రిపూట విద్యుత్‌ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘గుర్‌దాస్‌పుర్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్‌ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం కచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయి’’ అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఢిల్లీలో హై అలెర్ట్…. 
ఢిల్లీలోని ప్రధాన ప్రాంతలతో పాటు ముఖ్యమైన సంస్థల దగ్గర ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలైన ఇండియా గేట్, కుతుబ్ మినార్, ఎర్రకోట దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనితో పాటు, ఢిల్లీ పోలీసులు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, దౌత్యకార్యాలయ దగ్గర కూడా భద్రతను పెంచారు.

Read More వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి

Tags: