టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 'గ్రామీ' గౌరవం

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 'గ్రామీ' గౌరవం

ప్రపంచవ్యాప్తంగా సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 68వ గ్రామీ అవార్డుల వేడుకలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 68వ గ్రామీ అవార్డుల వేడుకలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాను ఈ ఏడాది గ్రామీ అవార్డు వరించింది. 90 ఏళ్ల వయసులో ఆయన ఈ అద్భుత గౌరవాన్ని అందుకోవడం విశేషం. గ్రామీ అవార్డుల ప్రీ-సెరిమనీలో భాగంగా.. మేడిటేషన్ అనే ఆడియో బుక్, 'ఉత్తమ ఆడియో బుక్, నరేషన్, స్టోరీటెల్లింగ్' విభాగంలో విజేతగా నిలిచింది. ఈ ఆడియో బుక్‌లో మైండ్‌ఫుల్‌నెస్, సామరస్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై దలైలామా చేసిన అమూల్యమైన వ్యాఖ్యలను పొందుపరిచారు. దలైలామా స్వయంగా హాజరు కాలేకపోవడంతో, ఆయన తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ ఈ అవార్డును అందుకున్నారు.

లోక కళ్యాణం కోసం ఈ గుర్తింపు: దలైలామా
ఈ గౌరవంపై దలైలామా స్పందించారు. "శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ మరియు మానవత్వం అనేవి నేటి ప్రపంచానికి అత్యంత అవసరం. గ్రామీ వంటి అంతర్జాతీయ గుర్తింపు, ఈ సందేశాలను ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా వ్యాప్తి చేయడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను" అని ఆయన తెలిపారు.

Read More రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు

తీవ్రంగా ఖండించిన చైనా
దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడంపై చైనా తన చిరకాల వైఖరిని ప్రదర్శించింది. ఈ అవార్డును చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. దలైలామా కేవలం ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు.. ఆయన మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కళలు, పురస్కారాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని చైనా ఆరోపించింది.

Advertisement

LatestNews