"మా భగవతి విశాల్ జాగరణ్" ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన

  • డిజిపి,  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: "మా భగవతి విశాల్ జాగరణ్" ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం అని,  ఇది భక్తులు దివ్యమాతతో అనుసంధానం కావడానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలను పొందడానికి సహాయపడుతుందని, దేవత పట్ల భక్తిని మరియు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి, శాంతియుత, సంపన్నమైన జీవితం కోసం ఆమె ఆశీర్వాదం కోరడానికి ఒక మార్గమని తెలంగాణ డిజిపి, డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శిఖా గోయల్  తెలిపారు. సనాతన సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా, దైవిక రక్షణ, కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రేమ, కరుణ, భక్తి, ధర్మం వంటి విలువలను పెంపొందించేందుకు హైదరాబాద్‌, నాంపల్లి, ఎక్షిబిషన్ గ్రౌండ్స్  లో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు  మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్ హైదరాబాద్ మా వైష్ణో దేవి మాత కు అంకితం చేస్తూ  "మా భగవతి విశాల్ జాగరణ్" ను  అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శిఖా గోయల్  పాల్గొని  ప్రత్యేక పూజలు చేసి, మాట్లాడుతూ జాగరణ్  ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి, మనస్సును మరియు ఆత్మను శుద్ధి చేస్తుందిని అన్నారు. మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్ హైదరాబాద్ కోర్ కమిటీ సభ్యులు రామ్ కిషన్ అగర్వాల్, అంజనీ కుమార్ అగర్వాల్, రాకేష్ నర్సింగ్‌పురియా, సంజయ్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్,  మనీష్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్, ముఖేష్ అగర్వాల్, రాకేష్ జలాన్, ,సూర్యకమల్ జి పుత్రా, అంజనీ కుమార్ సరోగి, ల నేతృత్వంలో  జరిగిన ఈ "మా భగవతి విశాల్ జాగరణ్" ను  జమ్మూ - కాట్రా లోని మాత వైష్ణవ దేవి మందిర్ పూజారి లోకేష్ జి మహారాజ్  ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు.  వేలాదిమంది భక్తులు పాల్గొని  తల్లి భగవతి ఆస్థానంలో అఖండ జ్యోతి, మహాసభ, అతీంద్రియ దర్శనం, భజన గంగా, మాత నిధి, తారా రాణి కథ, ఆర్తి, మహా ప్రసాదం, ఖజానా  వంటివి స్వీకరించారు. జోధ్‌పూర్ కు చెందిన ప్రముఖ  జాతీయవాద గాయకుడు ఛోటూ సింగ్ రావ్నా న్యూఢిల్లీ కు చెందిన ప్రముఖ  భజన గాయకుడు సుమిత్ సైని, హైదరాబాద్‌కు చెందిన   గాయకుడూ భజన సామ్రాట్ మురారి దహిమా ఉత్సాహభరితమైన భక్తి వాతావరణంలో మాతా భగవతి ని  స్తుతిస్తూ పాడిన  భజనలు మరియు కీర్తనలు భక్తులను  ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచ్చేతాయి. ఈ కార్యక్రమంలో జాంబాగ్ మాజీ  కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, రాజస్థాన్ ప్రగతి సమాజ్ ప్రధాన కార్యదర్శి  గోవింద్ నారాయణ్  రాతి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు కరోడీమల్ నర్సింగపూరియా తదితరులు పాల్గొన్నారు.

Tags: