నూతనంగా ఎన్నికైన డీసీసీ సభ్యులకు శుభాకాంక్షలు
On
విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి- భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిమ్మాపురం మహేందర్ రెడ్డిని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండాల నరసింహను రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర తదితరులు భువనగిరిలోని వివేర హోటల్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూస బాలకిషన్, జినుకల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహా రెడ్డి, శంబాల వెంకన్న, కే.భాస్కర్ రెడ్డి, తాళ్లపల్లి సత్తిరెడ్డి, పోలు వెంకట్ రెడ్డి, ఎడ్ల సురేందర్ రెడ్డి, కర్రె రమేష్, పి.నరసింహ, బి.నరసింహ, గట్టు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.



