నారాయణగూడలో కాలేజ్ బస్సు బీభత్సం
On
విశ్వంభర, నారాయణగూడ : నారాయణగూడలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. సోమవారం సాయంత్రం అతివేగంతో దూసుకొచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైంది. బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనతో నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
Read More ఘనంగా వీత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ.



