పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత
On
చెక్కు అందజేసిన ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా ఆర్ముడ్ డు పోలీస్ విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్ జూనైద్ ఇటీవల అనారోగ్యం కరాణంగా మరణించాడు. పోలీసు చేయూత పథకం ద్వారా జునైడ్ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. కమలాకర్ కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ఐ రామచందర్ గౌడ్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



