పాలకవర్గానికి సన్మానం
On
విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నమండల విశ్రాంత ఉద్యోగుల సంఘం మహాదేవపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. వారి అనుభవాన్ని వారి మాటలతో మహాదేవపూర్ పాలకవర్గానికి అభివృద్ధిలో భాగంగా పలు సూచనలు చేయడం జరిగింది. మేము కూడా మా వంతు పాలకవర్గానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్,ఉప సర్పంచ్ తుంగల శ్రీజ సంతోష్ పలువురు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు రిటైర్డ్ ఎంఈఓ అడపా రాజయ్య మరియు అక్బర్ సత్యనారాయణ, మెరుగు వెంకన్న, విక్రం సింగ్ పలువురు విశ్రాంత ఉద్యోగులు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



