కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ. మహిళా ఉన్నతే.. సమాజ ప్రగతి.. దేశ పురోగతి. - ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ.  మహిళా ఉన్నతే.. సమాజ ప్రగతి.. దేశ పురోగతి. - ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

విశ్వంభర హనుమకొండ జిల్లా :-మహిళలే ఈ దేశ అసలైన నిర్మాతలు.. మార్గదర్శకులు.వారు బలంగా ఉంటేనే.. జాతి నిర్మాణపు పునాదులు బలంగా ఉంటాయి.మహిళా సంఘాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి 

ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, ఛైర్మెన్ మార్నేని, ఇనుగాల 

Read More  మెడికల్ సీట్ సాధించిన ఏనుగు యశ్వంత్ రెడ్డికి సన్మానం

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే మా ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు . హన్మకొండ జిల్లా కేంద్రం లోని DCCB బ్యాంకు మీటింగ్ హాల్ నందు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ , ముఖ్యఅతిథిలుగా ఎంపీ  కడియం కావ్య , వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద దేవి, టెస్కాబ్ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు,  KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ల తో కలిసి పాల్గొని చీరలను పంపిణీ చేశారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ:-

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, భూ-మాతకు ఉన్నంత ఓపిక మహిళలకు ఉంటుందని, మహిళలు చదువులో రాణిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని, మహిళల ప్రగతి దేశ ప్రగతి అని అన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కథ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు పంట చేనుల వద్ద కట్టేవారని, ప్రస్తుతం నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామని, చీరల పంపిణీతో చేనేత కార్మికులకు కూడా ఉపాధి లభించిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకు వెళ్తున్నామని అన్నారు. మన నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు కేసీఆర్ పాలించి అప్పల కుప్పగా మార్చాలని, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులకు వేల ఎకరాల భూములు, ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారని, కేటీఆర్ అహంకారంతో సీఎం రేవంత్ రెడ్డిపై ఏకవచనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మహిళల పేరు మీదుగానే ఇస్తున్నామని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు..
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్ల ను  చేయడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి  ద్వారా పెట్రోల్ బంకులు, క్యాంటిన్లు, సోలార్ పవర్ ప్లాంట్ ల నిర్వహణ, ఆర్ టి సి బస్సులకు యజమానులు చేయడం, వంటి స్వయం ఉపాధి రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నది. అంతేకాకుండా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రూ.500 కి గ్యాస్ సిలిండర్లు లాంటి అనేక పధకాలను అందిస్తున్నది మన ప్రజా ప్రభుత్వం అన్నారు....ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  సంధ్యారాణి,  జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిని, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, జిల్లా స్థాయి ఉన్నాతాదికారులు , జిల్లా, మండల, గ్రామ సమైక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు....

Tags: