తంగళ్లపల్లిలో ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
On
తంగళ్ళపల్లి, ( విశ్వo భర ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకురాలు చెరుకుపల్లి శైలజ, కలికోట దేవేంద్రతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత గారు సమాజ సేవలో ముందుండి మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.



