ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కాలేరు వెంకటేశ్

విశ్వంభర, కాచిగూడ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని ప్రజల అవసరాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు, అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. హైదరాబాదు కాచిగూడ డివిజన్‌లోని మాడపాటి హనుమంతరావు పాఠశాల సమీపంలోని నాగమణి గూడలో రూ.5 లక్షల వ్యయంతో చేపడుతున్న సీవరేజీ పైప్‌లైన్ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానికులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు ఈ పనులతో ఉపశమనం లభిస్తుందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీవరేజీ, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేయాలని, పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వం అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/solving-public-problems-is-not-the-goal-venkatesh/article-17758

Tags: