ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీసీ జేఏసీ

విశ్వంభర, బర్కత్పుర: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ జేఏసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైందని తెలిపారు. గురువారం బర్కత్పురలో విద్యార్థులతో కలిసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు.ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15న 'చలో హైదరాబాద్' కార్యక్రమం చేపడతామని, అనంతరం 'కాక్రోచ్ ఉద్యమం' నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ జేఏసీ ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bc-jac-should-release-fee-reimbursement-arrears/article-17796

Tags: