ఓటు హక్కును కాపాడుకోవాలి: బల్లా ప్రశాంత్
విశ్వంభర, ముషీరాబాదు : ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామై ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు బల్లా ప్రశాంత్ పిలుపునిచ్చారు. హైదరాబాదు ముషీరాబాదు డివిజన్ ఆశీరాఖానా వీధిలో బీఎల్వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బల్లా ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజలు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించి దొంగ ఓట్ల నివారణకు ఫారాలను సక్రమంగా నింపాలని కోరారు. ఫారాలు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో: బీఆర్ఎస్ నాయకుడు ఎండీ షాహెబ్ పాల్గొన్నారు.