బీఆర్ఎస్‌లోకి రాజగోపాల్ రెడ్డి జంప్..!? - మంత్రి పదవి రాక అసంతృప్తి
- సీఎం కార్యక్రమానికి గైర్హాజరు.
- మంత్రి పదవి రాక అసంతృప్తి
- YTDA బోర్డు నియామకాలపైనా అసహనం
- పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు.
- బీఆర్ఎస్‌లో చేరతారనే టాక్..!
ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) బోర్డు నియామకాల విషయంలోనూ తనను సంప్రదించలేదని, తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన కీలక నిర్ణయంలో తనను పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురిచేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఒకవైపు మంత్రి పదవి దక్కకపోవడం... మరోవైపు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డు నియామకాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి... తాజాగా సీఎం కార్యక్రమానికి గైర్హాజరు కావడం—ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉన్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన తదుపరి అడుగు ఏంటనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ..!
YTDA బోర్డు వ్యవహారం ఇప్పుడు మరో కోణం తిరిగింది. దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖకు సైతం ఈ విషయం గురించి తెలియదని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే మంత్రి సురేఖ క్యాబినెట్ బేటీకి గైర్హజరయ్యారని టాక్ నడుస్తుంది. తనను ఏ మాత్రం సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తనకు అవమానం జరిగిందని బావించిన మంత్రి క్యాబినెట్ భేటీ రాకుండా సైడ్ అయ్యి తన అసంతృప్తి జ్వాలను వినిపించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారం పై మంత్రి సురేఖ హైకమాండ్ కూడా కంప్లైంట్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఏ మంత్రిని కూడా సంప్రదించకుండా ఇలాంటి ఓ పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె వాపోయినట్టు తెలుస్తుంది. కాగా, సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త సచివాలయ వర్గాలతో పాటు అందర్నీ షాక్కు గురిచేసినట్టు చెబుతున్నారు. మరి హైకమాండ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంశమని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.