సామాజిక సామరస్యానికి మధ్యవర్తిత్వమే మార్గం
- అంగన్వాడీ లతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
విశ్వంభర, మహబూబాబాద్ : సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పడంలో మధ్యవర్తిత్వం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ న్యాయవాది వై. చెన్న మల్లారెడ్డి అన్నారు. మంగళవారం సీడీపీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్న చిన్న వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా, ఇరువర్గాల అంగీకారంతో సమస్య ను పరిష్కరించుకోవడం వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. అంగన్వాడీ లు క్షేత్ర స్థాయి లో పనిచేయడం వల్ల ఒక వివాదం గురించి మొదట గా వాళ్ళకే తెలుస్తుందని కావున వారు వివదాలను జటిలం కాకుండా సామరస్యంగా పరిష్కరించే వేదికల గురించి సమాజంలోని ప్రజలకు తెలియచేయాలన్నారు. అనంతరం అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ వి. రాజ్ కృష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అంగన్వాడీ ల పాత్ర కీలకం అన్నారు.గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో వారు పోషిస్తున్న పాత్రను అభినoదిస్తూనే వారు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం కూడా ఆవశ్యం అన్నారు. జిల్లా న్యాయ సేవధికార సంస్థ అందించే సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో డోర్నకల్ సీడీపీఓ లక్ష్మి, మహిళా సాధికారత సంఘాలు, అంగన్వాడీ సూపర్వైజర్ రమణ, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.



