జోరుగా ఇసుక అక్రమ రవాణా
విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా,ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది . ఆదివారం సెలవు దినాల్లో అధికారులు లేని సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా రవాణా సాగిస్తున్నారు. ఇసుక మాఫియా, మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇసుక తరలిస్తున్నారూ సం బిధిత అధికారులు మాత్రం అటు కనిపెట్టి చూడరు. ఇసుక మాఫియా పై జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా ఉన్న. కింది స్థాయి అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు అంటే లెక్క లేకుండా ఇసుక మాఫియాకు చేతులు కలుపుతూ ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు అడ్డగా మారింది. ధర్పల్లి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఇసుక మాఫియా పై కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. ఆధికారల కనిచర్యలోని ఇసుక నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక తరలించడంతో వాల్టా చట్టానికి భారీ గండి కొడుతున్న వైనం. ఇసుకపై నియంత్రణ ఉంటుందా? సామాన్యుడికి ఇసుక అందిస్తారా? నిరుపేద వాడికి ఇసుక 3000 నుంచి 6000 రూపాయలకు ట్రాక్టర్ తీసుకుంటున్నారు. అందని ద్రాక్షగా మారింది ఇసుక. ప్రజా ప్రతినిధి కనిచర్యలోని ఇసుక మాఫియా రెచ్చిపోతుందని స్థానికుల ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర్పల్లి సీఐ బిక్షపతి ని వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణా ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇసుక అక్రమ రవాణా చేస్తే పీడియాకట్ కేసులు నమోదు చేస్తామని అలాగే కోర్టుకు కూడా పంపిస్తామని ఆయన అన్నారు. అక్రమంగా ఇసుక మొరం ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ అన్నారు.



