వ్యాధులపై అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హృదయ వాల్వు సంబంధిత వ్యాధులపై అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాహుల్ చౌదరి కొంగర తెలిపారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ అధ్యక్షుడు ఎస్. మనోహర్ రెడ్డి,కార్యదర్శి దశరథ్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం అపోలో ఆసుపత్రులు సహకారంతో జరిగింది. వాకర్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను అడగగా, వాటికి స్పష్టమైన సమాధానాలు అందించారు. కార్యక్రమం ఉపయోగకరంగా, విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో శైలజా మోహన్, పి.వి. నిరంజన్ రెడ్డి, ఎస్. రమేష్ రెడ్డి, ఎ. శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల రాజశేఖర్, కిషన్ రావు, నరసింహ, డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.కార్యక్రమాన్ని ఖజాంచి రవి కుమార్, ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, కృష్ణ తదితరులు నిర్వహించారు.



