డ్రంక్ అండ్ డ్రైవ్‌  343 కేసులు నమోదు

డ్రంక్ అండ్ డ్రైవ్‌  343 కేసులు నమోదు

విశ్వంభర, హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మార్చి 20, 21 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 343 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో ద్విచక్ర వాహనదారులు 287, త్రిచక్ర వాహనదారులు 24, కార్లు మరియు ఇతర వాహనదారులు 32 మంది ఉన్నారు. రక్తంలోని మద్యం శాతం ప్రకారం 30–50 మధ్య 71 కేసులు, 51–100 మధ్య 143, 101–150 మధ్య 77, 151–200 మధ్య 30, 201–250 మధ్య 14, 251–300 మధ్య 4, 300 పైన 4 కేసులు నమోదయ్యాయి. రహదారి భద్రత కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొంటూ, వాహనదారులు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.

🕒 23 Mar 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/343-cases-of-drunk-and-drive-were-registered/article-11855

Tags: