భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి 

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి 

  •  టిపిటిఎఫ్ జిల్లాఅధ్యక్షుడు రమేష్  

 విశ్వంభర, మహబూబాబాద్: భారతదేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఎక్కిన దేశభక్తులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతిని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ సెంటర్లో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ మాట్లాడుతూ,  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా,   స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మరణించి 95 సంవత్సరాలు అయినప్పటికీ వారి పోరాట స్ఫూర్తి నేటికీ కొనసాగుతుందన్నారు. భగత్ సింగ్ లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం ఈ దేశానికి అవసరం అన్నారు. సామ్రాజ్యవాదం, మరొక పక్క పెట్టుబడిదారీ విధానం వారి మధ్య జరుగుతున్న ఆధిపత్యం మూలంగా మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నాయన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండించాల్సిన భారత ప్రభుత్వం అమెరికాకు తలోగ్గిందని ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజల జీవనం స్తంభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మరో పక్క రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతుందన్నారు.  భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం రాచకొండ ఉపేందర్, గణపురం బిక్షపతి, సారెడ్డి రామలింగారెడ్డి సోమ విష్ణువర్ధన్, బి అంజయ్య, ఏ బాబురావు,గొర్రె శ్రీనివాస్, ఏ గోవర్ధన్, కె వెంకటేశ్వర్లు, దబ్బ నరేష్, విఎండి రఫీక్, కోడెం శ్రీనివాస్, తీగల రమేష్, జబర్లాల్, వెంపటి విజయరాజ్, ధరావత్ మోహన్, బి ప్రకాష్ సుజాత, నేలపోగుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: