డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

విశ్వంభర, విజయవాడ : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 : 45 నిమిషాలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సీట్ లో కూర్చుని పలు ఫైల్లను క్షణ్ణంగా చదివి సంతకాలు చేశారు.

అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. కాగా ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్... పంచాయితీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ