చింతపల్లిలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
విశ్వంభర, చింతపల్లి: మండలంలోని దేన్యతండా, బోత్యతండా, బాలాజీ తండా, చింతపల్లి, ధైర్యపురి తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు గురువారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. అదేవిదంగా నెల్వలపల్లి గ్రామం నుండి మల్లపురాజుపల్లి వరకు 4కోట్ల 75లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు బాలాజీ తండా, చింతపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిదంగా గొడ్డటి మల్లమ్మ రాములు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి, ఇంటి యాజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చింతపల్లి శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ మాత దేవాలయాన్ని, కర్మేడ్ శ్రీ గణపతి, సురమాంబ, కంఠమహేశ్వర, రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి, మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలపడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండూరు పవన్ కుమార్, ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, లింగంపల్లి వెంకటయ్య, మండల సర్పంచులు కాసారపు శ్వేతా శ్రీనివాస్, ఆవుల నాగేశ్వరి మల్లయ్య, అలివేలు భీమానాయక్, రామావత్ మహేష్, వాంకుడోవత్ అనిత దాసు నాయక్, చెన్నమ్మ లాలయ్య, మాజీ జెడ్పీటీసీలు జంగిటి నరసింహ, హరి నాయక్, రవికుమార్, మాజీ సర్పంచులు కాయితి జితేందర్ రెడ్డి, అంగిరేకుల గోవర్ధన్, దాసరి శ్రీనివాస్ యాదవ్ లు, చందు నాయక్, ఉజ్జిని నరేంద్రరావు, పంబలి వెంకటయ్య, హనుమ నాయక్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.



