రాంచందర్ రావుని కలిసిన చీకోటి
On
విశ్వంభర, మహేశ్వరం : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్బంగా డాక్టర్ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు పార్టీకి ఎల్లప్పుడూ సేవ చేసి, పార్టీ కోసం కష్టపడతానని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం మాజీ సర్పంచ్ కాసుల సురేష్ మిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు.



