సీఎన్జీ సరఫరా తగ్గడంతో వాహనదారుల ఇబ్బందులు

సీఎన్జీ సరఫరా తగ్గడంతో వాహనదారుల ఇబ్బందులు

విశ్వంభర, ముషీరాబాదు : అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో సీఎన్జీ దిగుమతులు తగ్గిపోవడం వల్ల నగరంలో సరఫరా అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అనేక సీఎన్జీ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కారణంగా హైదరాబాదు ముషీరాబాదు ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదు దోమలగూడ పోలీస్ స్టేషన్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీఎన్జీ స్టేషన్‌లో గురువారం వాహనాలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర బారులు తీశాయి. ఆటోలు, క్యాబ్లు గంటల తరబడి క్యూలో నిలబడి గ్యాస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరఫరా తగ్గడంతో నగరంలోని పలుచోట్ల సీఎన్జీ బంకుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు రెండు నుంచి మూడు గంటల వరకు సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని వారు తెలిపారు. ముఖ్యంగా ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: