రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

 విశ్వంభర,  శంషాబాద్:  కొత్తూరు నుండి శంషాబాద్ బైక్ పై వెళ్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం వెనుక నుండి ఢీకొట్టడంతో  ఘటన స్థలంలోనే మృతి చెందారు.ఈ సంఘటన  శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివారాల ప్రకారం,  రంగారెడ్డి జిల్లా కొత్తూర్ కు చెందిన  విక్కీ సింగ్,  సూరజ్  ఇద్దరు విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు కొత్తూరు నుండి శంషాబాద్ కు బైక్ పై బయలుదేరారు. బైక్ ను విక్కీ సింగ్ నడుపగా, సూరజ్ వెనకాల కూర్చున్నాడు. మార్గం మధ్యలో శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లి పాత తాండ చౌరస్తా వద్ద  ఒక గుర్తుతెలియని వాహనం అతివేగంగా ధీ కొట్టింది. విక్కీ సింగ్, సూరజ్ లు ఇద్దరు రోడ్డు పై కింద పడ్డారు. వారిద్దరిపై నుండి ఆ వాహనం వెళ్లడంతో  ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కకడే మృతి చెందినారు.   గుర్తుతెలియని వాహనం డ్రైవర్ అక్కడి నుండి వాహనం ఆపకుండా పారిపోయాడు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ రూరల్ పోలీస్ లు తెలిపారు.

Tags: