మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు

మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు

 విశ్వంభర, అంబర్‌పేట్ : బిఆర్ఎస్ పార్టీ బాగ్ అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి , బిఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రతినిధులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Tags: