కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే?
కుర్చీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు.
ఎన్డీయే కూటమి తరఫున శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఈ వేదికై ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సమావేశంలో వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడు కోసం కుర్చీలు వేశారు. అయితే చంద్రబాబు కోసం పసుపురంగులో ప్రత్యేక కుర్చీ వేశారు.
ఈ సమావేశానికి వచ్చిన వెంటనే చంద్రబాబు ముఖ్యనేతలకు, కార్యకర్తలకు అభివాదం చేసి ఆ కుర్చీలో కూర్చున్నారు. అయితే, కుర్చీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు.
దీంతో సిబ్బంది చంద్రబాబు కుర్చీని వెంటనే మార్చేశారు. మరో సాధారణ కుర్చీని సిబ్బంది తీసుకురాగానే చంద్రబాబు లేచి ఆ కుర్చీలో ఆసీనులయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇది చంద్రబాబు గారి సంస్కారం. కూటమి నేతలు పవన్ కల్యాణ్ గారు, పురందేశ్వరి గారికి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్లు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు గారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చంద్రబాబు గారి సంస్కారం. కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పురందేశ్వరి గారికి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు గారు#NaraChandrababuNaidu #PawanKalyan #KutamiTsunami #AndhraPradesh pic.twitter.com/CqdZ4FaJ0K
— Telugu Desam Party (@JaiTDP) June 11, 2024