అత్యాధునిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ప్రారంభం

అత్యాధునిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ప్రారంభం

విశ్వంభర, హైదరాబాద్ : ఖాతాల అవుట్ సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన జిఐ ఔట్ సోర్సింగ్ మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ టేక్ పార్క్ లో  అత్యాధునిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జిసిసి)ను ప్రారంభించింది. ఈ ప్రారంబోత్సవం బ్రిటిష్ డిప్యూటీ  హై కమిషన్ హైదరాబాద్ లో ఇన్ వర్డ్ ఇన్వెస్ట్మెంట్ (సౌతిండియా) హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్ సమక్షంలో జరిగింది. నగరంలోని ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రంగంలోని సమృద్ధమైన ప్రతిభను వినియోగించుకొని జిఐ ఔట్సోర్సింగ్ ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సేవలందించన్నట్లు జిఐ ఔటసోర్సింగ్ గ్రూప్ సిఇఓ తారిక్ హుస్సేన్ తెలిపారు. జిఐ ఔటసోర్సింగ్ ద్వారా బుక్ కీపింగ్ , మేనేజ్మెంట్ అకౌంట్స్, స్మార్ట్ సర్వీసులు, స్టాట్యూటరీ అకౌంట్స్, పేరోల్డ్ టాక్నేషన్, ఆడిట్ సపోర్ట్, జీఐ క్లౌడ్ కన్సల్టెన్సీ సేవలు అందించన్నుట్లు తెలిపారు. కొవాసెంట్ కంపెనీ అయిన ఎనబిర్ బాగస్వామ్యంతో హైదరాబాద్లో జిసిసి స్థాపించినట్టు పేర్కొన్నారు. సిద్ధార్థ్ విశ్వనాథన్ మాట్లాడుతూ జీఐ అవుట్ సోర్సింగ్ కొత్త కేంద్రం యుకే - భారత్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే సంయుక్త వృద్ధిమార్గాలను బలోపేతం చేస్తుందన్నారు.  కొవాసెంట్, ఎనబిర్ చైర్మన్, ఎండి సి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిఐ  అవుట్సోర్సింగ్ కు తాము బాగస్వామ్యంగా నిలిచి ,వారి ఎఐ-ఫస్ట్ జిసిసి ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్  అందించనున్నట్టు తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews