25వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా.  - పెండెం లక్ష్మిరామనాథ్ వెల్లడి.

25వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా.  - పెండెం లక్ష్మిరామనాథ్ వెల్లడి.

విశ్వంభర, హనుమకొండ జిల్లా:- నర్సంపేట పురపాలక సంఘం లో 25వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం లక్ష్మీ రామనాధ్  మీడియాకు వెల్లడించారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా సతీమణి పెండెం లక్ష్మి రామనాథ్  నామినేషన్ వేశామని ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఆదరిస్తున్నారని కాంగ్రెస్ ప్రజా పాలన చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన 25వ వార్డు సభ్యులందరికీ అందే విధంగా పాటు పడతామని అహర్నిశలు కాలనీ అభివృద్ధి దేయంగా పనిచేస్తామని తెలిపారు. అదేవిధంగా నర్సంపేట మున్సిపాలిటీ పోటీలో ఉన్న 30 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీలతో గెలిపించాలన్నారు.మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరం కలిసి కట్టుగా పని చేసి నర్సంపేట మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురా వేయడం ఖాయమన్నారు. మనందరం కలిసి కట్టుగా పని చేసి 30కి 30వార్డులలో గెలిచి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపించాలని అన్నారు.

Tags: