రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల మరణం నన్ను దుఃఖానికి గురిచేసింది యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి*
విశ్వంభర, చేవెళ్ల :-విద్యా సంస్థ కాదు.,ప్రమాదాల ఫ్యాక్టరీనా..
ICFAI క్యాంపస్‌కి ఎవరు బాధ్యులు..ర్యాగింగ్, గంజాయి, రోడ్డు మీద న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, ప్రమాదాలు, మరణాలు ఇవి వేరువేరు ఘటనలు కావు.ఇవి ICFAI క్యాంపస్ చుట్టూ తిరిగే ఒకే దుర్మార్గ చక్రంగా వార్తల్లోకి ఎక్కింది..ఒక్కసారి జరిగితే దురదృష్టం అనుకోవచ్చు.పునరావృతమైతే నిర్లక్ష్యం అనుకోవాలి.
అదే పదే పదే జరిగితే.
వ్యవస్థ వైఫల్యం అని స్పష్టంగా చెప్పాలి.
ICFAI క్యాంపస్ పేరు చెప్పగానే ఇప్పుడు విద్య కాదు. భయం గుర్తుకొస్తోంది.
రాత్రి వేళల్లో స్పోర్ట్స్ కార్లతో రాష్ డ్రైవింగ్, మత్తులో రోడ్లపై అల్లర్లు, చివరకు ప్రాణాలు పోయే ప్రమాదాలు, ఇవి క్యాంపస్ బయట జరిగాయని చేతులు దులుపుకోవడం యాజమాన్యానికి నైతిక హక్కు ఉందా..?
ఇక్కడ అసలు విపరీతమైన వ్యంగ్యం ఏమిటంటే ఇదే క్యాంపస్‌లో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
అంటే సమస్య ఉందని ఒప్పుకున్నారు.
కానీ సమస్యను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.
సదస్సులు ఫోటోలకా..?
బ్యానర్లు రిపోర్టులకా..?
లేదా ఘటన జరిగిన తర్వాత “మేము అవగాహన కల్పించామని చెప్పుకునే అలిబీలకా..?
క్యాంపస్ గేట్ల వద్ద భద్రత ఎందుకు కనిపించదు..?
విద్యార్థుల చేతుల్లోకి మద్యం, గంజాయి ఎలా చేరుతోంది..
రాత్రి వేళల్లో క్యాంపస్ నుంచి బయలుదేరే వాహనాలపై నిఘా ఎందుకు లేదు..
ఎన్ని ప్రాణాలు పోతే అధికారులు కదులుతారు..
ఇది విద్యార్థుల తప్పు మాత్రమే కాదు.
వారిని అదుపులో పెట్టాల్సిన యాజమాన్యానిది,
నిబంధనలు అమలు చేయాల్సిన పోలీసులది, పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా యంత్రాంగానిది సమిష్టి నేరం.
ప్రతి ప్రమాదం తర్వాత రెండు రోజులు హడావుడి.
ఆపై మళ్లీ మౌనం. మళ్లీ అదే మత్తు.
మళ్లీ అదే రాష్ డ్రైవింగ్. మళ్లీ ఇంకొక శవం.
ఇది ఆగకపోతే ICFAI క్యాంపస్ ఒక రోజు
విద్యా సంస్థగా కాదు
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చరిత్రలో మిగులుతుంది..



