ఘనంగా వనస్థలి జాతిరత్న పురస్కారాలు - వనస్థలిపురం భక్త సమాజం - గద్దె విజయ్ నేత సంయుక్తంగా ప్రధానం 

ఘనంగా వనస్థలి జాతిరత్న పురస్కారాలు - వనస్థలిపురం భక్త సమాజం - గద్దె విజయ్ నేత సంయుక్తంగా ప్రధానం 

విశ్వంభర,వనస్థలిపురం ;-సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వనస్థలిపురం భక్త సమాజం , బి ఎన్ రెడ్డి డివిజన్ , టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత సంయుక్తంగా చేపట్టిన వనస్థలి జాతిరత్న పురస్కార మహోత్సవం వనస్థలిపురం లోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పురస్కార మహోత్సవంలో వనస్థలిపురంలో వివిధ విభాగాలకు చెందిన అన్ని రంగాలలో పని చేసిన అనుభవజ్ఞులైన ప్రముఖులకు వనస్థలి జాతి రత్న అవార్డులతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అలాగే స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవే లక్ష్యం గా పని చేస్తూ ముందుకు సాగుతున్న బి ఎన్ రెడ్డి డివిజన్ , టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ను,  వనస్థలిపురం భక్త సమాజం వారిని పురస్కారం అందుకున్న ప్రముఖులు కమిటీ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన భక్త సమాజం వారికి , గద్దె విజయ్ నేత కు ఆశీర్వాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ పెద్దలను గుర్తించి వారు చేసిన సేవలకు గాను ఇలాంటి సన్మానం చేయడం సంతోషముగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనీ ఆకాంక్షించారు. యువకులకు , చిన్నారులకు ఆటపాటలలో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు  సి.హెచ్.వి.ఆర్.కె మూర్తి , సీనియర్ న్యాయవాది వి. సూర్యప్రకాష్  సభ నిర్వాహకులుగా వ్యవహరించారు. 

Tags: