ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్ నేను కాదు
On
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. తన బాయ్‌ఫ్రెండ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్ ని వరలక్ష్మి మనువాడింది. థాయ్‌లాండ్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై సచ్‌దేవ్ వరలక్ష్మిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. పెళ్లి తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తన పేరును మార్చుకోదని స్పష్టం చేశారు.
అదేసమయంలో తాను, తన కుమార్తె వరలక్ష్మి పేరు పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. ఇక ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ మాత్రం తాను కాదని చెప్పుకొచ్చారు.