మాదక ద్రవ్యాల నియంత్రణలో యువత భాగస్వామ్యం అవసరం

  • పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలి: డా. వర్రె వెంకటేశ్వర్లు

విశ్వంభర, సూర్యాపేట: సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత వాటికి బానిస కాకుండా కాపాడేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో యువత, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి వర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా, విక్రయాలపై తెలంగాణ పోలీసు శాఖ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిందని పేర్కొంటూ, ఈ చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, ఇందుకు కృషి చేసిన పోలీసు అధికారులు, సివిల్ సొసైటీ సంస్థలు, మీడియా ప్రతినిధులను అభినందించారు. ప్రస్తుత తెలంగాణ డీజీపీ, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ నాయకత్వంలో అమలు చేసిన హెచ్-న్యూ  కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలన, ప్రజల్లో అవగాహన, కట్టుదిట్టమైన అమలు చర్యలతో విశేష ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ కృషికి గుర్తింపుగా తెలంగాణ పోలీసు శాఖకు వరల్డ్ పోలీస్ సమ్మిట్–2025లో ప్రతిష్ఠాత్మక ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు’ లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైతే కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన, క్రమశిక్షణ, నిష్పాక్షికత, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పోలీసు వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్న డా. వర్రె వెంకటేశ్వర్లు, దేశంలో శాంతిభద్రతలు, అవినీతిరహిత సమాజ నిర్మాణానికి విద్యావంతులు, మేధావులు, సామాజిక సంస్థలు, మీడియా ప్రతినిధులు తమ వంతు బాధ్యతగా చట్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి ప్రతినిధులు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ప్రజలకు అందించే సేవలపై జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతూ డా. వర్రె వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమితి ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. యర్రమాద కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గుంతకండ్ల ముకుంద్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ముస్కుల గోవింద్‌రెడ్డి, విక్టర్ బాబు, రావుల రాంబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు బంగారు శ్రీధర్, బైరు వెంకన్న, విద్యాసాగర్, పత్తిపాక వెంకన్న, పట్టణ అధ్యక్షుడు పిడమర్తి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

కాసా రామ్మూర్తికి నివాళి

Read More ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. విజయ కుమారి

అంతకుముందు సూర్యాపేట పట్టణంలోని ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల మాజీ ప్రధానోపాధ్యాయుడు కాసా రామ్మూర్తి దశదిన సంస్మరణ కార్యక్రమంలో డా. వర్రె వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యా రంగానికి రామ్మూర్తి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి సతీమణి కాసా శారద, కుమార్తెలు కాసా స్నేహిత, కాసా హర్షితతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/youth-participation-is-essential-in-drug-control/article-19051

Tags: