ఉపేంద్ర కు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, జనగామ: కోల్కొండ గ్రామానికి చెందిన ముత్యాల ఉపేంద్ర ఈరోజు ఉదయం మృతి చెందారు. దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెర అనిల్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముత్యాల ఉపేంద్ర పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోల్కొండ గ్రామ శాఖ అధ్యక్షులు బీసు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కుర్నాల రవి,ముత్యాల ఆంజనేయులు ముత్యాల సంతోష్, కోతి సతీష్ తదితరులు పాల్గొని ముత్యాల ఉపేంద్ర గారికి ఘన నివాళులు అర్పించారు.