జనంపల్లి పద్మశాలి సంఘం నూతన పాలక మండలికి సన్మానం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలోని పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడుకి, పాలక మండలికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియచేశారు. యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వనం శ్రీనివాస్ ను, అలాగే సిల్క్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సంగిశెట్టి సుదర్శన్ ను, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో సంఘాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పద్మశాలి సోదరుల సంక్షేమానికి, వారి వృత్తిపరమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. నూతన అధ్యక్షులకు వారి బాధ్యతల్లో అన్ని విధాలా విజయాలు చేకూరాలని హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/janampalli-padmasali-sangam-is-a-tribute-to-the-new-governing/article-19079

Tags: