దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా

దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా

  • ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్

విశ్వంభర, నెల్లికుదురు: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లోని రామలింగేశ్వర ఆలయం ఆదివారం హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆలయ అర్చకులు గ్రామస్తులు హుస్సేన్ నాయక్ కు కన స్వాగతం పలికారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్,పట్టణ అధ్యక్షులు ప్రవీణ్, ఆలయ కమిటీ ప్రతినిధి వేద బ్రాహ్మణులు చంద్ర ప్రకాష్,నెల్లికుదురు మాజీ ఎంపీటీసీ వెన్నాకుల శ్రీను, మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి తదితరులు నెల్లికుదురు పట్టణంలోని శివాలయం తో పాటు,రామలింగేశ్వర ఆలయం, రంగనాయక స్వామి, హనుమాన్ ముత్యాలమ్మ తల్లి, లింగమంతుల ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన హుస్సేన్ నాయక్ సంబంధిత ఆలయాలకు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు మదన్ లాల్,చీకటి మహేష్ గౌడ్,గడ్డం అశోక్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నల్లాని పాపారావు మండల ప్రధాన కార్యదర్శిలు రాసయాకిరెడ్డి,బాదావత్ సురేష్,యుగంధర్,వివిధ గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హుస్సేన్ నాయక్ మండలంలోని శ్రీరామగిరి, వెంకటాపురం, నైనాల గ్రామాలలో ఇటీవల కన్నుమూసిన బాధ్యత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/will-work-for-the-development-of-temples/article-19015

Tags: