ఆదివాసి మహిళలపై దాడిని ఖండించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్
విశ్వంభర, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వేములూరు గ్రామంలో పోడు సాగు చేస్తున్న ఆదివాసి మహిళలపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంతెన సంజీవరావు ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిలో సోలం జ్యోతి, కల్తి సీతమ్మ, మడకం గంగమ్మ, మడకం జ్యోతి గాయపడ్డారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములను ఆదివాసుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు నిలిపివేసి, పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని మెంతెన సంజీవరావు విజ్ఞప్తి చేశారు.