బకాయి జీతాలు చెల్లించి న్యాయం చేయాలి: నూకతోటి పెదకొండయ్య
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఐటీఐ మల్లేపల్లి, విజయనగర్ కాలనీలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ కాంట్రాక్టు ఉద్యోగాన్ని పునరుద్ధరించి, 2014 నుంచి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలని నూకతోటి పెదకొండయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సమస్య పరిష్కారం కోసం 2023 డిసెంబర్ 8న తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు 16 మంది మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశానని, కార్మిక శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామిని పలుమార్లు కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే "ప్రజా సేవలో గాంధీభవన్" కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లకు, "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింద న్నారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలోనూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనూ అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి తన సమస్యను వివరించినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తనకు కాంట్రాక్టు ఉద్యోగాన్ని పునరుద్ధరించి, 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను చెల్లించి జీవనోపాధి కల్పించాలని నూకతోటి పెదకొండయ్య విజ్ఞప్తి చేశారు.