50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
విశ్వంభర, గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ బృందాలు శనివారం 8 ఇంక్లైన్ కాలనీలోని సంతోష్‌నగర్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించాయి.ఈ దాడుల్లో సుమారు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ ఘటనకు సంబంధించి మోతె కనుకయ్య (25), బేగంపేట గ్రామం, రామగిరి మండలానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని, స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యంతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.