హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు

: హుస్నాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయగిరి బిక్షపతి 

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన కంప్యూటర్స్, గణితశాస్త్రం, కామర్స్ విభాగాల్లో ఒక్కో గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టీ లకు కనీసం 50 శాతం, ఓసీ, బీసీలకు 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ /పిహెచ్ డి లో ఏదైనా ఒక అర్హత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి. నెట్, సెట్, పిహెచ్ డి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయని పక్షంలో డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులను జతచేసి జూలై 21 సాయంత్రం 4 గంటలలోపు హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని మాత్రమే డెమో, ఇంటర్వ్యూకు పిలుస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/guest-lecturer-posts-in-husnabad-degree-college/article-19011

Tags: