అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందాలు
: బీఆర్‌ఎస్ నేత అటికం రవీందర్ ఆరోపణలు
నాసిరకం పనులు, మట్టి తరలింపుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
విశ్వంభర, హనుమకొండ: గోపాలపూర్ చెరువు అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ ఆరోపించారు. ఆదివారం భీమారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమారంలో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు గోపాలపూర్ చెరువు నుంచి తీసుకొస్తున్న నల్ల మట్టిని ఉపయోగించి నాసిరకం పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మైనింగ్, మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గోపాలపూర్ చెరువు అభివృద్ధి పేరుతో చెరువులోని మట్టిని భారీ క్రేన్లు, జేసీబీల సహాయంతో రాత్రివేళ ప్రైవేటు వాహనాలను ఎస్కార్ట్‌గా పెట్టి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. అదే మట్టిని భీమారంలోని బొడ్రాయి సమీపంలో రోడ్డు, డ్రైనేజీ పనుల పేరుతో వినియోగిస్తూ నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ఈ పనుల వల్ల భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులను పక్కనపెట్టి, ఊరి బయట ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో కొందరి లాభాల కోసం పనులు చేపడుతున్నారని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కమిషన్ల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. భీమారం మెయిన్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందన లేదని రవీందర్ పేర్కొన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే భీమారంలో పోసిన రాగడి మట్టిని వెంటనే తొలగించి, మట్టి అక్రమ రవాణా వెనుక ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విక్టర్ బాబు, రాయకంటి సురేష్, నాయకపు శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుంజె సాయికుమార్, నాతి సమ్మయ్య, పోగుల రమేష్, ఉప్పు ప్రభాకర్, బెతెల్లి వినయ్, ఉప్పు రమేష్, ఎర్రబెల్లి సంపత్ రావు, పల్లపు రవికుమార్, బూర రోషన్ తదితరులు పాల్గొన్నారు.