బదిలీపై వెళ్లిన ఏవో, ఏఈవోలకు ఘనంగా వీడ్కోలు
విశ్వంభర, ఇనుగుర్తి: రైతులకు అంకితభావంతో సేవలందించిన వ్యవసాయ అధికారులు తమ సేవలతో అన్నదాతల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రజాప్రతినిధులు, రైతులు కొనియాడారు. బదిలీపై వెళ్లిన చిన్నముప్పారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) ముజాహిద్, వ్యవసాయ అధికారి (ఏవో) రవీందర్ రెడ్డికి ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నముప్పారం క్లస్టర్ పరిధిలోని సర్పంచులు, రైతుల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో సర్పంచ్ రాయలి భవాని శేఖర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచులు రాయలి భవాని శేఖర్, చెడుపాక సుజాత యాకయ్య, జనార్దన్ రెడ్డి, శ్రీరామగిరి పీఏసీఎస్ చైర్మన్ గుండా వెంకన్న, ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) భూక్య మహేందర్, ఆదర్శ రైతు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏఈవో ముజాహిద్, ఏవో రవీందర్ రెడ్డి రైతులకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. సాగు విధానాలు, పంటల సంరక్షణపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఏ రైతు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల అమలుతో పాటు యూరియా సరఫరాలోనూ వారి సేవలు విశేషమని తెలిపారు. ఇలాంటి సేవాభావం కలిగిన అధికారులు బదిలీ కావడం బాధాకరమని పలువురు రైతులు భావోద్వేగంతో పేర్కొన్నారు. సత్కారానికి స్పందించిన ఏఈవో ముజాహిద్ మాట్లాడుతూ రైతుల సహకారంతోనే తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలిగానని, ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడం సొంత కుటుంబాన్ని విడిచి వెళ్తున్నట్లుగా అనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లం ఐలయ్య, ఏఈవోలు భాస్కర్, చందూలాల్, మాజీ ఎంపీటీసీ కదిరి జగన్, మాజీ సర్పంచులు రాజు నాయక్, దర్శనం బిక్షపతి, నారాయణరెడ్డి, నాయకులు కాలేరు శివాజీ, రాయలి ఉప్పలయ్య, గంగాధర్, చిరగొని కిరణ్ గౌడ్, రైతులు గుండ్ల వెంకన్న, ఉడుత సంతోష్ యాదవ్, భూక్య బాలాజీ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.