న్యూ బృందావన్ కాలనీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

  • -అధ్యక్షునిగా వరికుప్పల యాదగిరి 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు న్యూ బృందావన్ కాలనీ నూతన కార్యవర్గ కమిటీని ఆదివారం కాలనీ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడు గా వరికుప్పల యాదగిరి, గౌరవ అధ్యక్షుడుగా జెర్కోని రాజు, ఉపాధ్యక్షుడు గా తాండ్ర రమేష్, ప్రధాన కార్యదర్శిగా కాసోజు దయాచారి, కోశాధికారిగా మైలారం విజయ్ రజాక్ ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులు గా పండాల రాఘవేందర్ గౌడ్, కొంపల్లి నగేష్, రవికాంత్ మరియు ప్రచార కార్యదర్శిగా వరికుప్పల అశోక్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ, కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాం. కాలనీలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ వాసులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/new-executive-committee-of-new-brindavan-colony-unanimously-elected/article-19027

Tags: