మా వాటా నీళ్లు మాకివ్వాలి.. 

మా వాటా నీళ్లు మాకివ్వాలి.. 

  • నీటి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
    పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల హెచ్చరిక

విశ్వంభర, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను వెంటనే కేటాయించాలని, అవసరమైతే నీటి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని జేఏసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. జేఏసీ కో-చైర్మన్లు బెక్కం జనార్దన్, వీరబ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ తాము ఇతర జిల్లాల ఆస్తులు లేదా భూములు అడగడం లేదని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు న్యాయంగా రావాల్సిన నీటి వాటానే కోరుతున్నామని స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దిండి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ నీటిని ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జిల్లా నీటి హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి జేఏసీ చేపట్టే ఉద్యమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎంపీ డా. మల్లు రవి మాట్లాడుతూ జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు, విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-should-be-given-our-share-of-water/article-19067

Tags: