సమాజానికి ఆదర్శంగా నిలిచే దాంపత్య జీవితం గడపాలి 

  •  ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

 విశ్వంభర, సూర్యాపేట: వివాహం అనేది రెండు మనసులను, రెండు కుటుంబాలను ఏకం చేసే పవిత్ర బంధమని, నూతన దంపతులు పరస్పర ప్రేమ, విశ్వాసం, అవగాహనతో ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యాపేట పట్టణంలోని రవి మహాల్‌లో ఆదివారం జరిగిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్–లీల దంపతుల కుమార్తె గౌతమి, గణేష్ చక్రవర్తిల వివాహ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకారమే దాంపత్య జీవితానికి బలమైన పునాదులని పేర్కొన్నారు.అనంతరం వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకలో పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-should-lead-a-married-life-that-is-ideal-for/article-18017

Tags: