ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్
:
విశ్వంభర, తొర్రూరు: పట్టణ 10వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్, సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యమే మన అందరి సంపదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ శిబిరంలో డా. సురేష్, షుగర్ వ్యాధి నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల సాధారణ ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు ఉచిత మందులుఅందజేశారు.ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు వైద్యులు పాల్గొన్నారు.