మొగిలి నాయక్‌కు ఘన సన్మానం

మొగిలి నాయక్‌కు ఘన సన్మానం

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందిన మొగిలి నాయక్ మద్దూరు మండలం పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండలం పెద్ద తండాలోని ఆయన నివాసంలో గిరిజన సంఘాల నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.  గిరిజన తండా నుంచి కష్టపడి పోలీసు శాఖలో ఉన్నత స్థాయికి ఎదిగి ఏఎస్సైగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు. మొగిలి నాయక్ మరింత ఉన్నత పదవులు అధిరోహించి సమాజానికి, జాతికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య వీరన్న నాయక్, పెద్ద తండా సర్పంచ్ గుగులోతు తిరుపతి నాయక్, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగులోతు భాస్కర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంబాబు నాయక్, కైలు నాయక్ తదితరులు పాల్గొని మొగిలి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-great-honor-for-mogili-naik/article-19039

Tags: