హుస్నాబాద్ యువతకు ఉద్యోగాలే లక్ష్యం
- తెలంగాణ రక్షణ సేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్
విశ్వంభర, హుస్నాబాద్: తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్‌ను నియమించిన అనంతరం ఆయన తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా కోహెడ మండలంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఐదు మండలాల్లో పార్టీ గద్దెల నిర్మాణం చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఉపాధి కల్పనే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన యువత నుంచి ఈ-మెయిల్ ద్వారా బయోడేటా ను స్వీకరించి, వారి అర్హతలకు అనుగుణంగా ప్రముఖ కంపెనీలతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఈ-మెయిల్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు హైదరాబాద్ స్థాయి నాణ్యమైన అధ్యయన సామగ్రిని తన సొంత ఖర్చులతో అందజేస్తానని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, హైకోర్టు ద్వారా ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.