గోదా దేవికి గాజులు సమర్పించిన భక్తులు
విశ్వంభర, ఘట్‌కేసర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం లక్ష గాజుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై గోదా దేవికి లక్ష గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో సాగాయి. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఆర్‌ఎస్ మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఆలయానికి విచ్చేసి అమ్మవారికి గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని, పిల్లాపాపలతో ఆనందంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి