ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ ప్లేట్ల పంపిణీ
- లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా తరుణి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
విశ్వంభర, తొర్రూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా తరుణి ఆధ్వర్యంలో గోపాలగిరి గ్రామంలో స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఆదివారం పీడీజీ లయన్ తమ్మెర లక్ష్మీనరసింహారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలగిరి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా తరుణి అధ్యక్షురాలు లయన్ ఎం. రేణుకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీడీజీ లయన్ తమ్మెర లక్ష్మీనరసింహారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్ ఎం. రేణుకా కృష్ణారెడ్డి సహకారంతో సుమారు రూ.10 వేల విలువైన 100 స్టీల్ ప్లేట్లను గోపాలగిరి గ్రామపంచాయతీకి అందజేశారు. గ్రామంలో జరిగే సామూహిక కార్యక్రమాలు, శుభకార్యాలు, వేడుకల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యనమల సావిత్రి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మధు, వార్డు సభ్యులు, జీఈటీ చైర్‌పర్సన్ లయన్ వి. శారద, జోన్ చైర్‌పర్సన్ లయన్ వి. శైలజ, క్లబ్ కార్యదర్శి లయన్ నిత్య శెట్టి, కోశాధికారి లయన్ కె. ఉమారెడ్డి, క్లబ్ సభ్యులు, సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు యనమల రవి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి ఖిచ్డీ ఆహారాన్ని పంపిణీ చేశారు. అదే సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, మాజీ అధ్యక్షులు (పీఎస్‌టీలు) తదితరులు పాల్గొన్నారు.