తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే మరో తెలంగాణ ఉద్యమం
- నలంద డిగ్రీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం
విశ్వంభర, మహబూబాబాద్: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేసిన మరో తెలంగాణ ఉద్యమం అనివార్యమని రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి అన్నారు. నేడు మహబూబాబాద్ లోని నలంద డిగ్రీ కళాశాలలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలనే డాక్టర్ అంబేద్కర్ నాటి ఆలోచనలకూ నేటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. రాజకీయ స్వలాభంకోసం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం గా చేస్తే తెలంగాణ తలలేని మొండెం గా మారుతుందని అన్నారు. తెలంగాణ పై ఇంకనూ సాంస్కృతిక దాడి జరుగుతూనే ఉందని.. తెలంగాణ కు 60%ఆదాయంను సమాకురుస్తున్న హైదరాబాద్ యుటిగా మారితే తెలంగాణ అభివృద్ధి జరగదని తెలిపారు. ఆస్తిత్వ వాదానికి, ప్రాంతీయ వాదానికి తేడాతెలుసుకొని ఆయా రాజకీయ పార్టీలు ప్రవర్తించాలని, ఓట్ల కోసం హైదరాబాద్ ను ఆగం చేయవద్దని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం ఫలితాలను ఇంకా పొందలేక పోతున్నామని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత మైతే అన్నీ రకాలుగా నష్టపోతామని అన్నారు. సర్ పై ఐటి ప్రొఫెసనల్ రణధీర్ మాట్లాడుతూ ఓటును కోల్పోకుండా పౌరులు జాగ్రత్తగా ఉండాలని, నోటీసు లు వస్తే అవసరమైన డాక్యూమెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపి ఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జేఏసీ నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మార్ని నేని వెంకన్న, తీపి జెఎసి స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, ఎం సి పి ఐ జిల్లా నాయకులు కంచ వెంకన్న, సిపిఎంఐఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అలకుంట్ల సాయిలు, జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కవిత, టీఎస్ యుటి రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి, టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు. బాలస్టీ రమేష్, విష్ణు వర్ధన్ రెడ్డి, రాచకొండ ఉపేందర్, సోమరాపు ఐలయ్య,ప్రముఖ కళాకారులూ కోమిరే సాకి, ఆర్టీసీ నాయకులు పట్టాభి లక్ష్మయ్య, పిడిఎస్యు నాయకులు బోనగిరి మధు, తెలంగాణ విద్యార్ధి నాయకులు చిత్తారి సోమన్న, ఎల్ పి హెచ్ ఎస్ నాయకులు బోడ లక్ష్మణ్, రిటైర్డ్ ఉపాధ్యాయులు, బందు నారాయణ, యాదగిరి, టి పి జెఎసి బాధ్యులు షేక్ జానీ, సోమ విష్ణు వర్ధన్, హలవత్ లింగ్యా, పి ఎల్ వై నాయకులు సామ పాపయ్య,బట్టు చైతన్య,ఆటో యూనియన్ నాయకులు నలమాస సాయి తదితరులు పాల్గొన్నారు